అమ్మాయి కాదు.. రోబో...
Publish Date:Jan 9, 2015

జపనీయులు ఎప్పటికప్పుడు కొత్త తరహా రోబోలను రూపొందించడంలో బిజీగా వుంటారు. తాజాగా జపాన్‌కి చెందిన తోషిబా ఒక అందమైన అమ్మాయి ఆకారంలో ఒక రోబోను రూపొందించింది. ఈ రోబో పేరు చిహిరా ఐకో. సడెన్‌గా చూస్తే నిజమైన అమ్మాయిలా, జపాన్ సంప్రాదాయ బద్ధంగా కనిపించే చక్కని ఆడపిల్లాలా అనిపించే ఈ రోబో మనిషిలా చేతులు కదిలిస్తూ చక్కగా మాట్లాడుతుంది, పాటలు పాడుతుంది. సందర్భానికి తగినట్టుగా ఎక్స్‌ప్రషన్లు కూడా ఇస్తుంది. ఈ రోబోకి ఫ్రంట్ ఆఫీసులో రిసెప్షనిస్టుగా కూర్చోబెట్టడానికి అన్ని అర్హతలూ వున్నాయట. టీవీల్లో వార్తలు చదవడానికి కూడా భేషుగ్గా పనికొస్తుందట. ఈ రోబోను భవిష్యత్తులో మరింత డెవలప్ చేసి హోటళ్ళలో వెయిట్రెస్‌గా, హాస్పిటళ్ళలో నర్సులాగా కూడా పని చేసేలా చేస్తారట.
http://www.teluguone.com/news/content/chihiraaico-the-robot-toshiba-is-designed-to-make-conversation-and-entertain-33-41949.html