ఏపీ కొత్త సీఎస్‌గా దినేష్ కుమార్...?
Published on: Mon Feb 27, 2017 10:56AM

ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎంపికపై అధికారులు, ప్రభుత్వ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎస్పీ టక్కర్ పదవీ కాలం రేపటితో ముగియనుండటంతో కొత్త సీఎస్‌గా ఎవరిని నియమించాలన్న దానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర స్థాయిలో కసరత్తు చేస్తున్నారు. ఆయన స్థానంలో అజయ్ కల్లంకు బాధ్యతలు అప్పగించేందుకు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
అయితే అజయ్ కల్లం పదవీ కాలం కూడా మార్చి 31తో ముగుస్తుంది. కాని మూడేసి నెలల చొప్పున ఆరు నెలల పాటు అజయ్ కల్లం పదవి కాలాన్ని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది..అయితే దీనికి కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ అభ్యంతరం తెలిపింది. దీంతో వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకు సర్వీస్ ఉన్న దీనేష్ కుమార్ వైపు ముఖ్యమంత్రి మొగ్గు చూపినట్లు తెలుస్తోంది..దీనేష్ కుమార్ 1983 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఇవాళ లేదా రేపు దినేష్‌ను సీఎస్‌గా నియమిస్తూ ఉత్తర్వులు వెలువడే అవకాశాలు ఉన్నాయి.


