శ్రీవారికి కేసీఆర్ సమర్పించనున్న కానుకలు ఇవే
Published on: Mon Feb 20, 2017 3:19PM
.jpg)
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే శ్రీవారికి బంగారు ఆభరణాలు చేయిస్తానని మొక్కుకున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. ఎన్నో పోరాటాల తర్వాత ఆ కల సాకారం అయ్యింది. దీంతో కేసీఆర్..రూ.5 కోట్లతో బంగారు ఆభరణాలు చేయించారు..అందులో రూ.3.7 కోట్లతో 14.2 కిలోల స్వర్ణ సాలగ్రామహారం, రూ. 1.21 కోట్లతో 4.65 కిలోల కంఠాభరణాన్ని తయారు చేయించి..టీటీడీ ఖజానాలో భద్రపరిచారు. దీంతో ఆ మొక్కులు చెల్లించేందుకు తెలంగాణ సీఎం సిద్ధమయ్యారు. 22వ తేదీ ఆయన కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించనున్నారు.
కేసీఆర్ పర్యటన ఇలా సాగుతుంది...
* 21వ తేదీ సాయంత్రం 3.55 గంటలకు బేగంపేట్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు..
* సాయంత్రం 4 గంటలకు ప్రత్యేక విమానంలో తిరుపతికి బయలుదేరుతారు.
* సాయంత్రం 5 గంటలకు రేణిగుంట విమానాశ్రయంకు చేరుకుంటారు.
* 6.30 గంటలకు తిరుమల గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు.
* 22-02-2017 రోజు ఉదయం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుని కానుకలు సమర్పిస్తారు. అనంతరం పుష్పగిరి మఠంలో టీఆర్‌ఎస్ నాయకుడు, పౌరసరఫరాల కార్పోరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి వివాహానికి హాజరవుతారు.
* ఉదయం 10:30 గంటలకు అతిథి గృహానికి చేరుకుంటారు.
* 11:30 గంటలకు తిరుపతిలోని పద్మావతి అమ్మవారి దేవాలయానికి చేరుకుని దర్శనం చేసుకుంటారు. 11:50 గంటలకు దేవాలయం నుంచి రేణిగుంట విమానాశ్రయంకు బయలుదేరుతారు.
* మధ్యాహ్నం 12:30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ బయలుదేరుతారు.
* మధ్యాహ్నం 1:30 గంటలకు తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు.


