TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

తగ్గిన జయ ఆస్తులు..

Published on: Tue Apr 26, 2016 11:58AM

తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆస్తుల విలువ తగ్గింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆమె చెన్నైలోని ఆర్కే నగర్ నియోజకవర్గం నుంచి నామినేషన్ దాఖలు చేసిన జయ తన ఆస్తుల వివరాలు ప్రకటించారు. తన ఆస్తులు రూ.113.73 కోట్లు అని తెలిపారు. వీటిల్లో స్థిర ఆస్తులు రూ.41.63 కోట్లు, చర ఆస్తులు రూ.72.10 కోట్లుగా ఉన్నట్లు వెల్లడించారు. గత ఉపఎన్నిక సందర్భంగా ప్రకటించిన ఆస్తులతో పోలిస్తే ఈ సారి జయ ఆస్తులు రూ.3.4 కోట్లు తగ్గాయి.