TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బాలయ్యను పక్కనెట్టడానికే లోకేష్‌కి మంత్రి పదవా?

Published on: Sat Apr 9, 2016 12:56PM

 

ప్రస్తుతం ఏ రెండు పచ్చకండువాలు కలిసినా మాట్లాడుకునే హాట్ టాపిక్ చంద్రబాబు బాలకృష్ణకి మంత్రి పదవి ఇస్తారా? లేక నారా లోకేష్ కి మంత్రి పదవిస్తారా? ఎవరి కోసం ఎవరిని పక్కన బెడతారు అంటూ చెవులు కొరుక్కుంటున్నారు. కాబోయే ముఖ్యమంత్రి బాలకృష్ణ అంటూ చాలాకాలంగా నందమూరి అభిమానులు నినాదాలు చేస్తున్నారు. పైగా బాలయ్య ఇప్పుడు ఎమ్మెల్యే కూడా. ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఇవ్వకపోయినా కనీసం బాలకృష్ణకు మంత్రి పదవైనా ఇవ్వాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. దాంతో పాటు తనకు మంత్రినయ్యే అర్హతలున్నాయంటూ బాలయ్య బాహాటంగానే ప్రకటించారు కూడా. ఈ పరిణామాలన్నింటిని  ఒక కంట కనిపెడుతున్న అధినేత. బాలయ్యకు పదవిస్తే తనకు లేనిపోని తలనొప్పులు వస్తాయని ఇవాళ మంత్రి పదవి..రేపు పార్టీ పగ్గాలు అంటూ డిమాండ్లు వస్తాయని గ్రహించారు. అందుకే తన వారసుడిగా నారా లోకేష్‌ని నిలబెట్టడానికి నారా వారు మరో ఎత్తుగడ వేసినట్టు కనిపిస్తున్నారు.

 

తన రాజకీయ వారసుడిగా భవిష్యత్తు టీడీపీ అధినేతగా, ముఖ్యమంత్రిగా చినబాబును చూడాలనుకుంటున్నారు బాబు. పార్టీలో లోకేష్‌కి పోటీ రాకుండా ఉండేందుకు దాదాపుగా నందమూరి వంశాన్ని పక్కకు నెట్టిన చంద్రబాబు ఇప్పుడు బాలకృష్ణను కూడా వారసత్వం నుంచి దూరం చేయడానికి ప్లాన్ వేసినట్టు ట్రస్ట్ భవన్ టాక్. అందుకోసం లోకేష్ అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. చినబాబును ముఖ్యమంత్రిగా చూడాలని ఉంది..ఆయనకి అన్ని అర్హతలు ఉన్నాయి. ఆయనకు మంత్రివర్గంలోకి స్వాగతం అంటూ మంత్రులు ప్రకటనల మీద ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే ఒకవేళ బాలయ్యను కాదని చంద్రబాబు లోకేష్‌కి మంత్రి పదవి ఇస్తే లెజెండ్ కాదనడు, కాదనలేడు ఎందుకంటే బాలయ్యకి లోకేష్ మేనల్లుడు మాత్రేమే కాదు, స్వయానా తన కుమార్తెకి భర్త, అంటే అల్లుడు కూడా. దట్స్‌వై బాలయ్య నుంచి మేటర్ క్లియర్. ఇదంతా ముందే ఊహించిన బాబు లోకేష్-బ్రహ్మాణిల వివాహంతో అన్ని సెటిల్ చేసేశారు. అందుకే చంద్రబాబుని అపర చాణుక్యుడనేది.