సోషల్ మీడియాలో చంద్రబాబుపై అభ్యంతరకర పోస్టులు
Published on: Mon Feb 20, 2017 4:32PM
.jpg)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు వస్తున్నాయి. దీనిపై ఆంధ్రప్రదేశ్ హౌసింగ్ బోర్డు ఛైర్మన్ వర్ల రామయ్య ఇవాళ విజయవాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఎం ఫోటోలను మార్ఫింగ్ చేసి అసభ్యంగా ప్రచారం చేస్తున్నారని ఫిర్యాదులో తెలిపారు. ఇటీవల తన ఫేస్‌బుక్ ఖాతాలోకి చంద్రబాబు ఫోటోని మార్ఫింగ్ చేసి ఆయనకు వ్యతిరేకంగా పెట్టిన పోస్టింగ్ వచ్చిందని రామయ్య మీడియాకు తెలిపారు. ఇలాంటి వాటితో తెలుగుదేశం పార్టీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యక్తిగత ప్రతిష్టకు భంగం కలిగే అవకాశంతో పాటు శాంతిభద్రతలపై ప్రభావం చూపవచ్చని అన్నారు. ఇటువంటి పోస్టులు చేస్తోన్న వారిపై పోలీస్ శాఖ కఠినచర్యలు తీసుకోవాలని కోరారు.


