TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చీఫ్ విప్‌గా గండ్ర, విప్‌గా అనిల్

Published on: Thu Feb 9, 2012 1:55PM

హైదరాబాద్: చీఫ్ విప్‌గా గండ్ర విప్‌గా చిరు వర్గం ఎమ్మెల్యే అనిల్ పేర్లు ఖరారయ్యాయి. వరంగల్ జిల్లాకు చెందిన శాసనసభ్యుడు గండ్ర వెంకటరమణా రెడ్డిని చీఫ్ విప్‌గా నియమించారు. గండ్ర వెంకటరమణా రెడ్డి మంత్రి పదవిని ఆశించారు. అయితే, ఆయనను మంత్రివర్గంలో చేర్చుకోవడానికి వీలు కాలేదు. దీంతో మంత్రి పదవి ఇవ్వడం సాధ్యం కాదని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ముందుగానే ఆయనకు చెప్పారు. అందుకు ప్రతిగా చీఫ్ విప్ పదవిని ఆయనకు ఇచ్చారు. విప్‌లుగా ఆరేపల్లి మోహన్, తూర్పు జయప్రకాష్ రెడ్డి, ద్రోణంరాజు శ్రీనివాస్ పేర్ని నాని, చిరంజీవి వర్గానికి చెందిన అనిల్ పేర్లు ఖరారయ్యాయి. చిరంజీవి వర్గం నుంచి విప్ పదవి కోసం వంగా గీత కూడా పోటీ పడ్డారు. అయితే తెలంగాణకు తన వర్గం నుంచి ఓ పదవి ఇవ్వాల్సిన అవసరం ఉందని భావించిన చిరంజీవి అనిల్ వైపే మొగ్గు చూపారు.