దేశంలో ప్రతిపక్షాలు లేవన్న చిదంబరం.. అసలు కారణం ఇదే
Published on: Tue Feb 1, 2022 12:20PM
కాంగ్రెస్ ప్రతి సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి చిదంబర ఒక సంచలన ప్రకటన చేశారు. దేశంలో ప్రతిపక్ష పార్టీలు లేవు అని తేల్చి పడేశారు.అయితే ఆయన ఆగ్రహానికి కారణం లేక పోలేదు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు నిన్న (సోమవారం) మొదలయ్యాయి. సమావేశాల తొలి రోజునే ప్రభుత్వం ఆర్థిక సర్వే 2022ను పార్లమెంట్కు సమర్పించింది.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్ ‘ కు సమర్పించిన ఆర్థిక సర్వేలో ప్రభుత్వం 2022-23 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 8 నుంచి 8.5 శాతంగా ఉండొచ్చని అంచనా వేసింది. వ్యవసాయ రంగం వాటా అధికంగా ఉంటుందని ఆర్థిక సర్వేలో స్పష్టం చేశారు. మిగిలిన రంగాల ప్రాధాన్యతలో పెద్దగా మార్పులు ఉండబోవనే అంచనాలు వ్యక్తం అయ్యాయి.
అయితే ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆర్థిక సర్వేకి కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలపై చిదబరం ఆగ్రహం వ్యక్తం చేయడానికి, సంబంధ ఏమిటని, అనిపించవచ్చును. కానీ, వుంది. చిదంబరం తెల్లారు ఝామునే లేచి, ఆర్ధిక సర్వేపై ఏ పార్టీ ఎలా స్పందించిందో చూసేందుకు పేపర్లు తిరగేస్తే, ఎక్కడా విపక్షాల రీయాక్షన్ కనిపించనే లేదు ఆ కారణంగా చిదంబరంకు కోప మొచ్చింది. ఆ కోపంలోనే ఆయన, ‘దేశంలో ప్రతిపక్ష పార్టీలు లేవు’, ఒకటి రెండు పార్టీలు ఉన్నా అవి నోరు మెదపట్లేదని’ ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఆ ఒకటి రెండు పార్టీల్లో కాంగ్రెస్ ఉందా లేదా అనేది ఆయన స్పష్టం చేయలేదు.
అదలా ఉంటే చిదంబరం, ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటుగా, తమ అగ్రహానికి కారణం కూడా ఆయనే వివరించారు. ఆయనేమన్నారంటే ..తెల్లవారు జామున తాను దినపత్రికల్నీ చూశానని, ఎకనమిక్ సర్వే మీద ప్రతిపక్ష పార్టీలు స్పందించినట్లుగా ఎక్కడే గానీ తనకు వార్తలు కనిపించలేదని అన్నారు. దీన్ని బట్టి చూస్తోంటే దేశంలో ప్రతిపక్షం అనేది లేకుండా పోయిందనేది స్పష్టమౌతోందని తేల్చి చెప్పారు.
ఈ సందర్భంగా ఆయన ట్వీట్లో ఛార్లెస్ డికెన్స్ రాసిన ఎ టేల్ ఆఫ్ టూ సిటీస్ నవలను ఉటంకించారు. అత్యద్భుత సందర్భాలు, అత్యంత దారుణ పరిస్థితులను చూస్తున్నామని చెప్పుకొచ్చారు. కేంద్ర ప్రభుత్వంపైనా విమర్శలను సంధించారు. 2020 మార్చి 31వ తేదీ నాటి పరిస్థితులను ఒక్కసారి గుర్తు చేసుకోవాలని ఆయన సూచించారు. ఎకనమిక్ సర్వే చూసిన ప్రతీసారీ తనకు వికారం కలుగుతోందని వ్యాఖ్యానించారు. 2020 మార్చి 31వ తేదీన ఏ వృద్ధిరేటును టార్గెట్ చేశామో.. రెండు సంవత్సరాల తరువాత కూడా అదే వృద్ధి రేటును అందుకోవడానికి కష్టపడాల్సి వస్తోందని పేర్కొన్నారు.


