చిదంబర ఉవాచ: ఓడినా గెలుపు మాదే స్మీ!
Published on: Thu Dec 20, 2012 11:34AM
.jpg)
గుజరాత్ ఎన్నికలలో ఓడిపోతున్న కాంగ్రెస్ పార్టీకి హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో గెలుపు బాటపట్టడం పండగ చేసుకొనేందుకు ఒకింత అవకశం కల్పించి ఊరట కలిగించిందని చెప్పవచ్చును. అక్కడ కూడా ఓడినట్లయితే పార్టీ పరువు పోయుండేది గానీ, అదృష్ట వశాత్తు అక్కడ కాంగ్రెస్ హస్తవాసి బాగానే ఉందిపుడు.
ఆర్దిక శాఖామాత్యులు చిదంబరంగారు డిల్లీలో మీడియా వాళ్ళతో మాట్లాడుతూ “నిజానికి మేమే రెండు చోట్లా గెలిచాము. హిమాచల్లో ఎలాగు గెలుపు మాదేనని మాకు తెలుసు. గానీ, గుజరాత్ లో కూడా మాదే గెలుపు అని చెప్పవచ్చును. ఈ ఎన్నికలలో క్లీన్ స్వీప్ చేసేస్తానని గొప్పలుపోయిన నరేంద్రమోడీని కట్టడిచేయడంలో మేము సఫలం అయ్యేము గనుక, అక్కడా మాదే నైతిక విజయంగా చెప్పవచ్చును.”


