TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏప్రిల్ 1 నుంచి చికెన్ షాపులు బంద్‌...ఎందుకంటే?

Published on: Wed Mar 25, 2026 3:58PM

 

ఏప్రిల్ 1 నుంచి తెలంగాణ వ్యాప్తంగా చికెన్ షాపులను బంద్ చేయాలని తెలంగాణ చికెన్ ఓనర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది. ఉప్పల్, ఎల్బీనగర్ సహా పలుచోట్ల చికెన్ వ్యాపారులు పోస్టర్లు అంటిస్తూ తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. పౌల్ట్రీ కంపెనీలు సరైన మార్జిన్ ఇవ్వకపోవడంతో తీవ్ర నష్టాలు వస్తున్నాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

లాభాలు లేక వ్యాపారం కొనసాగించడం కష్టమైందని అంటున్నారు. తగ్గించిన మార్జిన్‌ను పునరుద్ధరించే వరకు బంద్ కొనసాగిస్తామని స్పష్టం చేశారు. పౌల్ట్రీ కంపెనీలు మార్జిన్ పెంచకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు చేపడతామని హెచ్చరిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే షాపులు పూర్తిగా మూసివేయాల్సి వస్తుందని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో కిలో చికెన్ ధర రూ.360 నుంచి రూ.370 వరకు ఉంది.

చికెన్ వ్యాపారుల ఆవేదన ఇదే

పౌల్ట్రీ కంపెనీల విధానంపై చికెన్ షాప్ యజమానుల ఆగ్రహం
ఇచ్చే మార్జిన్ సరిపోవట్లేదని వ్యాపారుల అసంతృప్తి
గతంతో పోలిస్తే కిలోకు సుమారు రూ.20 తక్కువ మార్జిన్ ఇస్తున్నారని ఆరోపణ
చికెన్ ధరలు పెరుగుతున్నప్పటికీ, తమకు వచ్చే లాభం తగ్గుతోందని ఆవేదన