TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

మద్యం కుంభకోణం కేసు.. చెవిరెడ్డికి బెయిలు

Published on: Thu Jan 29, 2026 12:13PM

మద్యం కుంభకోణం కేసులో అరెస్టై గత 226 రోజులుగా విజయవాడ జిల్లా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న వైసీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డికి ఎట్టకేలకు బెయిలు లభించింది. ఆయనకు షరతులతో కూడిన బెయిలు మంజూరు చేస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఉత్తర్వలు ఇచ్చింది. ఇదే మద్యం కుంభకోణం కేసులో మరో ఇద్దరు నిందితులకు కూడా హైకోర్టు షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది.

మద్యం కుంభకోణం కేసులో నిందితులైన సజ్జల శ్రీధర్ రెడ్డి, వెంకటేష్ నాయుడులకు కూడా కోర్టు బెయిలు మంజూరు చేసింది. అయితే వీరంతా పాస్ పోర్టులను కోర్టుకు అప్పగించాలనీ, విచారణకు సహకరించాలనీ, అలాగే అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్ల కూడదనీ షరతులు విధించింది. అదలా ఉంటే.. ఇదే కేసులో నిందితులు, ప్రస్తుతం రిమాండ్ ఖైదీలుగా విజయవాడ జిల్లా జైలులో ఉన్న కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ముప్పిడి అవినాష్ రెడ్డిలు దాఖలు చేసుకున్న బెయిలు పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది.