TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

అసెంబ్లీ ఎదుట వైసీపీ ఎమ్మెల్యే దీక్ష...

Published on: Mon Mar 27, 2017 10:21AM

 

రావాణాశాఖ అధికారిపై దౌర్జన్యం చేసిన ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావులపై వెంటనే కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ వైసీపీ ఎమ్మెల్యే  చెవిరడ్డి భాస్కరరెడ్డి అసెంబ్లీ ఎదుట దీక్షకు దిగారు. నల్లరంగు దుస్తులు ధరించి ఆయన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తిరుపతి విమానాశ్రయంలో జరిగిన ఓ చిన్న ఘటన నేపథ్యంలో తాను, ఎంపీ మిథున్ రెడ్డి, వైసీపీ శ్రీకాళహస్తి ఇంఛార్జ్ మధుసూదన్ రెడ్డిలపై తప్పుడు కేసు పెట్టి 21 రోజులు నెల్లూరు సెంట్రల్ జైల్లో పెట్టారని మండిపడ్డారు. అలాంటిది ఐజీ స్థాయి అధికారిపై టీడీపీ నేతలు దుర్భాషలాడినా కేసులు నమోదు చేయలేదని మండిపడ్డారు.