TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అధికారం పోయినా చెవిరెడ్డిలో ఇంకా అహంకారం తగ్గలేదు : ఎమ్మెల్యే పులివర్తి

Published on: Fri Jul 4, 2025 9:18PM

 

అధికారులు అంటే లెక్కలేని తనం వైసీపీ నేతల్లో ఇంకా కనిపిస్తుంది. అధికారుల పట్ల వారి దురుసు ప్రవర్తన వారి పెత్తందారి పోకడలకు అద్దం పడుతుంది. వైసీపీ నేతల్లో పెత్తందారి పోకడలు పోలేదు అనడానికి చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి దురుసు ప్రవర్తనే నిదర్శనం. మద్యం కుంభకోణం కేసులో సిట్ అధికారుల విచారణకు సహకరించాల్సింది పోయి... మీ అంతు తేలుస్తా, సిట్ కార్యాలయం ముందు ఇంటిని అద్దెకు తీసుకొని ఒక్కొక్కరి తాట తీస్తానని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెదిరించిన తీరు ఆయన అహంకార దోరిణికి నిదర్శనం. విచారణ చేస్తున్న అధికారులపై ఈ రకమైన దురుసు ప్రవర్తన వైసీపీ నాయకుల సైకో విధానాన్ని తెలియజేస్తోంది. అధికారం పోయినా ఇంకా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అహంకారం దగ్గలేదు. 

ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పినా చెవిరెడ్డిలాంటి మూర్ఖుల్లో ఇంకా మార్పు రాలేదు. ఇంకా వైసీపీ ప్రభుత్వమే ఉందన్న భ్రమలో ఉన్నాడు. జైలు జీవితం తప్పదని తెలిసే విజయవాడ జైలులో చెవిరెడ్డి రంకెలు వేస్తూ చిందులు తొక్కుతున్నాడు. తప్పు చేశాడు కాబట్టే చెవిరెడ్డిలో ఈ విధమైన భయం, ఆందోళనలు కనిపిస్తున్నాయి. మద్యం కుంభకోణంలో కోట్ల రూపాయలు దోచుకొని, ఎన్నికల్లో తప్పుడు పద్దతిలో గెలిచేందుకు తరలించాడు. సిట్ అధికారులు 200 ప్రశ్నలు వేసినా ఒక్క సమాధానం కూడా చెవిరెడ్డి నుంచి రాలేదంటే... ఐదేళ్ల పాటు మద్యం కుంభకోణంలో ఏ రేంజ్ లో సొమ్ములు పక్కదారి పట్టించారో అర్థమవుతుంది. మద్యం కుంభకోణంలో ఉన్న ఏ ఒక్కరిని ఈ ప్రభుత్వం విడిచిపెట్టదని వైసీపీ నాయకులు గుర్తుంచుకోవాలని చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తెలిపారు