Latest News
Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...Loading News ...చెవిరెడ్డి కూటమి ప్రభుత్వం ఉందని గుర్తెరిగి మసలుకో..పులివర్తి హెచ్చరిక
posted on: Jun 6, 2025 8:20PM
.webp)
తిరుపతి జిల్లా చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై ప్రస్తుత ఎమ్మెల్యే పులివర్తి నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రగిరి నియోజకవర్గ అభివృద్ధిని చెవిరెడ్డి ఆపలేరు అని సవాల్ విసిరారు. ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉందని గుర్తెరిగి మసలుకోవాలని చెవిరెడ్డిని ఆయన హెచ్చరించారు. రాష్ట్రంలో చంద్రగిరి నియోజకవర్గం పరువు తీస్తున్నారని ఇకనైనా తన పద్దతి మార్చుకోవాలని హితవు పలికారు. ఎమ్మెల్యే కాక ముందు మీ ఆస్తి ఏంత శాసన సభ్యుడు అయిన తర్వాత మీ ఆస్తి అన్ని వేల కోట్లు ఎలా వచ్చాయో చెప్పగలరా అని ప్రశ్నించారు. దొంగ ఓట్లు చేర్చిన అక్రమ కేసు త్వరలో మీకు చుట్టుకుంటుంది అని జోష్యం చెప్పారు.
మీ దగ్గర ఉన్న గన్ మెన్ కు కోట్ల రూపాయల సంపాదన ఎలా వచ్చాయి అని ప్రశ్నించారు. తుడాను అడ్డుపెట్టుకుని కేవీస్ అనే పేరుతో.. మీ కుటుంబ సభ్యుల బినామీ కంపెనీలతో డబ్బులను దోచుకో లేదా అని ప్రశ్నించారు. హెల్త్ క్యాంపు, మొక్కల పంపిణీ పేరుతో కోట్ల రూపాయలు దోచుకోలేదా అని నిలదీశారు. వాట్సాప్ కాల్స్ తో ప్రభుత్వ అధికారులను చెవిరెడ్డి బెదిరిస్తున్నారు అని ఆరోపించారు. మా ప్రభుత్వంలో ఏ ఐఏఎస్, ఐపిఎస్ లు అధికారులు మీ వైసీపీ నాయకులకు భయపడరు అని చెప్పారు. కసిరెడ్డికి నీకు సంబంధం లేదని నువ్వు చెప్పగలవా అని ప్రశ్నించారు. గత ఎన్నికల్లో మూడు కంటైనర్ లలో మీ డబ్బు ఎనిమిది కోట్లు దొరికింది నిజం కాదా అని నిలదీశారు. తుమ్మలగుంట అభివృద్ధికి మేము ఎంత చేసామో ప్రజలకు తెలుసు అని అన్నారు. లిక్కర్ స్కామ్ కేసులో నీ వాటా కూడా త్వరలో సీట్ తెలుస్తుంది అని నాని హెచ్చరించారు.



.webp)


