సంసార చదరంగం ఆడనున్న కోనేరు హంపి
Published on: Sat Aug 2, 2014 9:02AM

ప్రఖ్యాత చదరంగం క్రీడాకారిణి, ఆంధ్రప్రదేశ్ తెలుగుదేజం కోనేరు హంపి సంసార చదరంగం ఆడబోతోంది. అదేనండీ... కోనేరు హంపి వివాహం జరగబోతోంది. విజయవాడలోని ఎ కన్వెన్షన్ సెంటర్లో ఈనెల 13వ తేదీన కోనేరు హంపి వివాహం ఎఫ్ట్రానిక్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ దాసరి రామకృష్ణ కుమారుడు అన్వేష్‌తో జరుగనుంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని కోనేరు హంపి తండ్రి కోనేరు అశోక్ సతీసమేతంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని కలిసి కోనేరు హంపి వివాహానికి ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రిక అందించారు. హంపి వివాహానికి చంద్రబాబు తప్పకుండా రావాలని మరీ మరీ కోరారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం కోనేరు అశోక్ రెండు లక్షల రూపాయల విరాళాన్ని ముఖ్యమంత్రికి అందించారు.


