TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మంత్రిగా చిరంజీవి :మోపిదేవి వెంకట రమణ

Published on: Sun Jan 15, 2012 1:14PM

హైదరాబాద్:తిరుపతి శాసనసభ్యుడు చిరంజీవికి రాష్ట్ర మంత్రివర్గంలో బెర్తు ఖాయమని మంత్రి మోపిదేవి వెంకట రమణ వ్యాఖ్యానించారు. చిరంజీవిని మంత్రివర్గంలోకి తీసుకోవాలని పార్టీ అధిష్టానం నిర్ణయించిందని చెప్పారు. ఒకరోజు ముందో, వెనకో ఆయనను మంత్రివర్గంలోకి తీసుకోవడం మాత్రం ఖాయమన్నారు. మంత్రిగా చిరంజీవి సమర్థంగా రాణించగలరని ఆయన అన్నారు. త్వరలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో తన శాఖను మార్చినా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి పని చేస్తానని చెప్పారు.
తాను ఎక్సైజ్ శాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత అనుహ్యంగా ఎన్నో ఒత్తిళ్లు వచ్చాయని చెప్పుకొచ్చారు. ఇటీవల మైలవరంలో జరిగిన కల్తీ మద్యం మరణాలు కొన్ని దుష్టశక్తుల కారణంగా చోటు చేసుకున్నాయని, ఇందులో ఇందులో ఎక్సైజ్ శాఖ వైఫల్యమేమీ లేదని చెప్పారు. శాఖాపరంగా సిబ్బంది లేదా అధికారుల తప్పులేవైనా ఉన్నట్టు రుజువైతే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మోపిదేవి చెప్పారు. కడప జిల్లా నేతలు కూడా చిరంజీవి రాష్ట్రంలోనే ఉండాలని కేంద్రానికి వద్దని చెబుతున్నారు.