TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చెపాక్‌లో భారీస్కోరు చేదించిన చెన్నై

Published on: Fri Apr 13, 2012 10:19AM

 Chennai Super Kings Royal Challengers, Royal Challengers Chennai Super Kings, IPL 5 Chennai Super Kings, IPL 5 Royal Challengers ఐపిఎల్‌లో చెన్నయ్ సూపర్‌కింగ్స్‌ బెంగళూరు ఫై భారీస్కోరు చేదించింది. ఓపెనర్‌ ప్లెసిస్‌ మెరుపులకు కెప్టెన్‌ ధోనీ వేగంవంతమైన ఇన్నింగ్స్‌ జతకావడంతో ఐదు వికెట్లతో విజయం సాధించింది.46 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో చెన్నరు జట్టులో టాప్‌ స్కోరర్‌గా నిలిచిన ప్లెసిస్‌కు మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది.


టాస్‌ గెలిచిన రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ముందుగా బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఓపెనర్లు అగర్వాల్‌, గేల్‌ ధాటిగా ఆడి, తొలి ఇన్నింగ్స్‌కు అర్ధశతకం భాగస్వామ్యం నెలకొల్పారు. తొలి వికెట్‌ రూపంలో అగర్వాల్‌ (45) అవుటైనా, తర్వాత గేల్‌, కోహ్లీ కలిసి రెండో వికెట్‌కు 109 రన్స్‌ భాగస్వామ్యం నెలకొల్పారు. వీరిద్దరూ అవుటైన తర్వాత బెంగళూరు వెంటవెంటనే వికెట్లు కోల్పోయింది. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 205 రన్స్‌ చేసింది.అనంతరం లక్ష్య సాధనకు దిగిన చెన్నయ్ కూడా ధాటిగానే ఇన్నింగ్స్‌ ఆరంభించింది. ఓపెనర్‌ మురళీవిజరు మినహాయిస్తే మిగిలిన బ్యాట్స్‌మెన్‌ అందరూ రాణించారు. చివరి ఓవర్‌ వరకూ ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో ఆఖరి బంతికి జడేజా ఫోర్‌ కొట్టడంతో చెన్నరు ఇన్నింగ్స్‌ 208కి చేరడంతోపాటు జట్టుకు అద్భుత విజయం అందించాడు.