చెన్నై భవన ప్రమాద మృతులు 26 మంది!
Published on: Tue Jul 1, 2014 11:11AM

చెన్నైలో నిర్మాణంలో వున్న భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 26కి చేరుకుంది. 12 అంతస్తుల భవన శిథిలాల కింద మంగళవారం ఉదయం మరో మృతదేహన్ని కనుగొన్నారు. మృతుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మహేష్. దీంతో ఈ ప్రమాదంలో మరణించిన వారి సంఖ్యకి చేరుకుంది. భవనం శిథిలాల కింద ఇంకా 26 మంది చిక్కుకుని వున్నారని భావిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. మంగళవారం ఉదయం శిథిలాల కింద నుంచి ఒక మహిళను ప్రాణాలతో రక్షించారు.


