చెన్నై దుర్ఘటనలో 42కి చేరిన మృతులు
Published on: Wed Jul 2, 2014 11:09AM

చెన్నైలో నిర్మాణంలో వున్న భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య 42కి చేరుకుంది. 11 అంతస్తుల భవన శిథిలాల కింద నుంచి ఇప్పటి వరకు 69మందిని వెలికితీశారు. భవనం శిథిలాల కింద ఇంకా 20నుంచి మరో 25మంది చిక్కుకుని వున్నారని భావిస్తున్నట్లు పోలీసులు చెప్పారు. వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. మంగళవారం ఉదయం శిథిలాల కింద నుంచి ఒక మహిళను ప్రాణాలతో రక్షించారు.


