డీఎండీకే అధినేత విజయ్‌కాంత్ అరెస్ట్
Published on: Mon Dec 26, 2011 2:02PM
చెన్నై:
ముళ్ల పెరియార్ డ్యామ్ వివాదానికి నిరసనగా ప్రధాని మన్మోహన్ సింగ్ ఎదుట నల్ల జెండాలతో ఆందోళన చేపట్టిన డీఎండీకే అధినేత విజయ్‌కాంత్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనతోపాటు నిరసన కార్యక్రమంలో పాల్గొన్న మరో 200 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మద్రాస్ యూనివర్సిటిలో గణితశాస్త్ర మేధావి శ్రీనివాస రామానుజం 125వ జన్మదిన వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళుతున్న ప్రధాని కాన్యాయ్‌ని అడ్డుకునేందుకు సైదాపేట ప్రాంతంలో విజయ్‌కాంత్ బృందం ప్రయత్నించారు. దాంతో వారిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.


