TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రాజకీయాల్లోకి చెంగారెడ్డి కుమార్తె?

Published on: Thu Feb 16, 2012 3:59PM

చిత్తూరు జిల్లా:చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీకి చెందిన బలమైన నాయకుల్లో రెడ్డివారి చెంగారెడ్డి ఒకరు. గతంలో ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన 2009లో నగరి నియోజకవర్గంనుంచి పోటీ చేసి ఓడిపోయారు. వయసుమీరటంతో పాటు ఆరోగ్యం కూడా సహకరించకపోవడంతో ఆయన తన కుమార్తె ఇందిరను రాజకీయాల్లోకి తీసుకురావాలని యోచిస్తున్నట్లు తెలిసింది. అయితే నగరి నుంచి పోటీచేయడానికి యువ నాయకుడొకడు తీవ్రంగా ప్రయత్నస్తున్నాడు. పుత్తూరు నియోజకవర్గం నుంచి 2004లో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీచేయాలని ఆశపడిన ఆ యువనాయకుని కోరిక ముద్దు కృష్ణమనాయుడువల్ల తీరలేదు. 2009 ఎన్నికల సమయానికి పుత్తూరు నియోజకవర్గ రద్దు కావడంతో నగరిలో తన సొంత వూరు, మండలం కలిసిపోయాయి. అపట్లోనే  తన అదృష్టం పరీక్షించుకోవడానికి ఆ యువ నాయకుడు జిల్లాలో తనకు అత్యంత సన్నిహితుడైన ఒక ముఖ్యనేత ద్వారా ప్రయత్నించారు. అయితే చెంగారెడ్డి పవర్ ముందు ఆ యువ నాయకుడి ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఇప్పుడు చెంగారెడ్డి రాజకీయ సన్యాసం చేసి తన కుమార్తెను వారసురాలిగా ప్రకటించబోతున్నట్లు తెలియడంతో ఈ యువ నాయకుడు మళ్లీ తన ప్రయత్నాలు ప్రారంభించారు. చెంగారెడ్డి తన కూతురు ఇందిరను రాజకీయ వారసురాలిగా తీసుకురావాలని ఆలోచిస్తున్న విషయం యువ నాయకుడి దగ్గర ఎవరైనా ప్రస్తావిస్తే ఆయన పెద్దాయన, ఆయనంటే నాకు చాలా గౌరవం, ఆయన ఉంటే ఎవరూ కాదనరు. ఆయన తన కూతురును తెచ్చి టికెట్ ఇప్పించాలనుకుంటే ఎలా? నా కుటుంబం కూడా దశాబ్దాలనుంచి కాంగ్రెస్ పార్టీకి సేవ చేసింది అని తన మనసులోని మాట చెబుతున్నాడు. భవిష్యత్తులో ఇందిర రాజకీయ ప్రవేశం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ యువ నాయకుడు ఆమెకు అడ్డుపడటం కూడా ఖాయమనిపిస్తోంది.