TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

జే బ్రాండ్లలో హానికర కెమికల్స్!.. ల్యాబ్ రిపోర్టులో సంచలన అంశాలు!

Published on: Tue Mar 22, 2022 2:32PM

బూమ్ బూమ్.. ప్రెసిడెంట్‌ మెడల్, స్పెషల్ స్టేటస్.. తెలుసుగా ఇవ‌న్నీ ఏంటో. ఏపీలో జే బ్రాండ్స్. ప్ర‌పంచంలో ఎక్క‌డా క‌నిపించ‌వు ఈ బ్రాండ్లు. కేవ‌లం ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోనే అమ్ముతారు. అదే జ‌గ‌న‌న్న మ‌హిమ‌. చూట్టానికి మద్యం లానే ఉంటాయి.. తాగేట‌ప్పుడూ అలానే ఉంటుంది.. కానీ, తాగాకే ఏదో తేడా కొడుతుంది. కొన్ని బ్రాండ్లు ఎంత తాగినా ఎక్క‌క‌పోవ‌డం.. ఇంకొన్ని కొంచెం తాగినా బాగా ఎక్కేయ‌డం.. ఏ బ్రాండ్ అయినా తాగాక క‌డ‌పులో, ఒంట్లో అదోలా అవ‌డం.. ఇల ర‌క‌ర‌కాల సింప్ట‌మ్స్‌. ఇన్నాళ్లూ ఆ ఊరూపేరు లేని బ్రాండ్లు మాత్ర‌మే అమ్మ‌డంతో ఎలాగోలా ఉన్న స‌రుకుతో స‌రిపెట్టుకున్నారు. ఇటీవ‌ల ప‌లు పేరున్న కంపెనీల స‌రుకు లిమిటెడ్‌గా అమ్ముతుండ‌టంతో కాస్త అడ్జ‌స్ట్ అవుతున్నారు. ఇక జే బ్రాండ్లు తాగితే అదోలా అవుతోంద‌ని.. నాటుసారాకు ఎగ‌బ‌డుతున్నారు ఏపీ మందుబాబులు. రాష్ట్ర‌వ్యాప్తంగా ఎక్క‌డ‌ప‌డితే అక్క‌డ లోక‌ల్ లిక్క‌ర్‌కు కొద‌వే లేదు. డిమాండ్ కూడా అధికం. దీంతో, ఇదే అదునుగా క‌ల్తీ మ‌ద్యం పెద్ద ఎత్తున త‌యారు చేస్తుండ‌టంతో.. ప‌లువురు మృత్యువాత ప‌డుతున్నారు. కేసులు పెరుగుతున్నా.. స‌ర్కారు మాత్రం అవి క‌ల్తీ సారా మ‌ర‌ణాల‌ని మాత్రం ఒప్పుకోక‌పోవ‌డం విచార‌క‌రం. 

తాజాగా, టీడీపీ నేత‌లు ఏపీలో అమ్ముతున్న జే బ్రాండ్ మ‌ద్యాన్ని ల్యాబులో టెస్ట్ చేయించారు. ఆ బ్రాండ్స్ లిక్క‌ర్‌లో ప్రాణాలు తీసేంత అత్యంత హానిక‌ర ర‌సాయ‌నాలు ఉన్నాయ‌ని ల్యాబ్ రిపోర్ట్‌లో వెల్ల‌డ‌వ‌డం సంచ‌ల‌నంగా మారింది. ఆ ల్యాబ్ రిపోర్టును జ‌త చేస్తూ అసెంబ్లీ స్పీక‌ర్‌కు, మండ‌లి ఛైర్మ‌న్‌ను లేఖ రాశారు టీడీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఏపీలో నాటుసారా, జే బ్రాండ్ల నుంచి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు చట్టసభల్లో ప్రభుత్వం చర్చకు అంగీకరించేలా చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కోరారు. 

ఆ మ‌ద్యాన్ని అత్యధిక ధ‌ర‌ల‌కి అమ్ముతుండ‌టంతో నిరుపేద‌లు సారాకి అల‌వాటు ప‌డి ప్రాణాలు తీసుకుంటున్నారని టీడీపీ ప్ర‌జాప్ర‌తినిధులు లేఖ‌లో తెలిపారు. ప్రభుత్వం స‌హ‌జ మ‌ర‌ణాలంటూ చ‌ర్చ నుంచి త‌ప్పించుకోవాల‌ని చూస్తోందని ఆరోపించారు. వెంటనే చర్చకు అనుమతించాలని.. బాధితులకు న్యాయం చేయాలని లేఖలో కోరారు.