TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వచ్చే మూడేళ్లతో కలిపి 5గురు సిఎంలు వస్తారు:గాలి

Published on: Sat Jan 14, 2012 8:46PM

హైదరాబాద్:ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై, కాంగ్రెసు పార్టీపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు గాలి ముద్దు కృష్ణమ నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు.వచ్చే మూడేళ్లతో కలిపి కాంగ్రెసు ప్రభుత్వం ఐదేళ్ల కాలంలో ఐదుగురు ముఖ్యమంత్రులు మారడం ఖాయమని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం పాటు పడాల్సింది పోయి ముఖ్యమత్రి కిరణ్ కుమార్ రెడ్డి పదవిని కాపాడుకోవడానికి ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారని ఆయన విమర్సించారు.ప్రచారం కోసం, సొంత పరపతిని పెంచుకోవడానికే ముఖ్యమంత్రి హైదరాబాదులో భాగస్వామ్య సదస్సును నిర్వహించారని ఆయన అన్నారు.పాత కంపెనీలనే కొత్తగా చూపారు తప్ప ఒక్క పరిశ్రమ కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదని ఆయన అన్నారు. ఉత్తరప్రదేశ్‌  మాదిరిగా మారుస్తానని కాంగ్రెసు ప్రధాన కార్యదర్శి రాహుల్ గాంధీ చెబుతున్నారని, అవినీతిని పెద్ద యెత్తున పెంచడమే రాహుల్ మాటల్లోని ఆంతర్యమా అని ఆయన అన్నారు. సామాన్యుడికి ధరలు అందుబాటులో లేకపోవడంతో పాటు తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయని, రాష్ట్ర ప్రజలు సంక్రాంతి పండుగను కూడా జరుపుకోలేని దుస్థితిలో ఉన్నారని ఆయన అన్నారు.