పూరి జగన్నాథ్ మీద ఛీటింగ్ కేసు
Published on: Fri Aug 29, 2014 8:43AM
.jpg)
ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ ఛీటింగ్ కేసులో ఇరుక్కున్నారు. పూరి జగన్నాథ్‌తోపాటు ఆయన భార్య లావణ్య కూడా ఛీటింగ్ కేసులో ఇరుక్కున్నారు. పూరి జగన్నాథ్ దంపతులతోపాటు ఒక కన్‌స్ట్రక్షన్ కంపెనీ మీద కూడా జూబిలీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు పూర్వాపరాల్లోకి వెళ్తే, పూరి జగన్నాథ్‌కి చెందిన జూబిలీహిల్స్‌లోని 1000 గజాల స్థలాన్ని ఆయన గతంలో బ్యాంకులో 5 కోట్లకు తాకట్టు పెట్టారు. ఆ తర్వాత అందులో సగం తిరిగి చెల్లించారు. ఈ స్థలం పూరి జగన్నాథ్ భార్య లావణ్య పేరు మీద వుంది. కొంతకాలం తర్వాత ఆస్థలంలో అపార్ట్‌మెంట్ నిర్మించే ప్రపోజల్‌తో సుబ్బరాజు అండ్ కంపెనీతో పూరి జగన్నాథ్ కుటుంబం ఒక ఒప్పందం కుదుర్చుకుంది. వీరు తమ స్థలాన్ని ఆ కంపెనీకి ఇవ్వాలి. వారు బ్యాంకులో మిగిలి వున్న రెండున్నర కోట్ల అప్పు తీర్చేయాలి. అయితే సదరు కన్‌స్ట్రక్షన్ కంపెనీ సంస్థగానీ, పూరీ జగన్నాథ్ గానీ బ్యాంకులోను తీర్చకుండానే ఆ స్థలంలో అపార్ట్‌మెంట్ నిర్మించి అమ్మేశారు. బ్యాంకు అధికారులు లోను వసూలు కోసం ప్రయత్నించి తమకు తాకట్టు పెట్టిన స్థలంలో అపార్ట్‌మెంట్ నిర్మాణం అయి వుండటం చూసి అవాక్కయ్యారు. దాంతో అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్లు కొన్నవారు, బ్యాంకు అధికారులు పూరి జగన్నాథ్ మీద, ఆయన భార్య లావణ్య మీద, సుబ్బరాజు కన్‌స్ట్రక్షన్ కంపెనీ మీద కేసు నమోదు చేశారు.


