మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలిపై చీటింగ్ కేసు..

ఉంగుటూరు మండలం, ఆత్కూరులో నిర్వహించిన గ్రామదర్శిని, గ్రామ వికాసం కార్యక్రమంలో మరియంబీ అనే మహిళ కన్నీటిపర్యంతమైంది.దీంతో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఏం కావాలంటూ ప్రశ్నించారు. సాయం కావాలని ఆమె కోరగా.. ఎమ్మెల్యే అధికారులకు సాయం చేయాలని సూచించారు.

 

 

అయితే తనకు కావాల్సింది డబ్బులు కాదంటూ 'రెండేళ్ల క్రితం నా కొడుకు సాయికుమార్‌ డెయిరీ ఫామ్‌లో పనిచేస్తూ.., చెరువులో పడి మృతిచెందాడు. ఆ సమయంలో డెయిరీ ఫామ్‌ యజమాని దొప్పలపూడి ప్రవీణ్ నుంచి తనకు నష్టపరిహారం ఇప్పిస్తామంటూ కాంగ్రెస్‌ నాయకురాలు సుంకర పద్మశ్రీ మధ్యవర్తిత్వం వహించారని,ఇచ్చిన నష్టపరిహారం మొత్తం తన వద్దే ఉంచుకుని రెండేళ్లయినా ఇవ్వట్లేదని ఆరోపిస్తూ గ్రామదర్శినిలో కన్నీళ్లు పెట్టుకుంది.

 

 

డబ్బులు అడిగితే సుంకర పద్మశ్రీ బ్లాక్‌మెయిల్‌ చేస్తూ బెదిరిస్తోందని ఆరోపించింది'. మరియంబీ వాదన విన్న వంశీ పోలీసులకు పిర్యాదు చేయాలని సూచించారు. దీంతో ఆమె పిర్యాదు చేసింది.చీటింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.అయితే, తనకు లక్ష రూపాయలు ఇచ్చింది నిజమే అయితే..ఎవరు ఇచ్చారో వారే వచ్చి పట్టుకెళ్లాలంటూ ఫోన్‌లోనే సవాల్ విసిరారు పద్మశ్రీ. తనపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చేస్తున్న రాజకీయ కుట్రలో భాగంగానే ఈ కేసు నమోదు చేయించారని పద్మశ్రీ ఆరోపిస్తున్నారు.