TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సోము వీర్రాజు అల్లుడిపై చీటింగ్, ఫోర్జరీ కేసు

Published on: Tue Jan 4, 2022 9:39AM

ఆంధ్రప్రదేశ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అల్లుడిపై చీటింగ్, ఫోర్జరీ కేసు నమోదు అయ్యింది. తమ ఆస్తి పత్రాలను ఫోర్జరీ చేసి కొవ్వూరు ఎస్‌బీఐ బ్యాంకులో కవల వెంకట నరసింహం లోన్ తీసుకున్నారని రాజమండ్రికి చెందిన గద్దె జయరామకృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొవ్వూరు టౌన్ పోలీస్‌స్టేషన్‌లో గత నెల 4న జయరామకృష్ణ  ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో సోమువీర్రాజు అల్లుడు వెంకట నరసింహంపై ఐపీసీ 406, 419, 420, 465 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. 

సోమువీర్రాజు అల్లుడిపై చీటింగ్, ఫోర్జరీ కేసు వ్యవహారానికి సంబంధించి కుమార్తె సూర్యకుమారి స్పందించారు. తన తండ్రికి,  లోన్ వ్యవహారానికి ఎటువంటి సంబంధం లేదని.. ఇదంతా రాజకీయ కుట్ర అన్నారు. తన తండ్రితో తమకు  ఎటువంటి రాకపోకలు, సంబంధాలు లేవని చెప్పారు. . వివాహం తరువాత  తన తండ్రి ఇప్పటి వరకు తమ ఇంటికి రాలేదన్నారు. బిజినెస్ లావాదేవీల్లో భాగంగానే లోన్ తీసుకున్నామని,  కావాలనే కేసు పెట్టారని సూర్యకుమారి చెప్పారు. పోలీసులు ఇంతవరకు తమకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదన్నారు. డబ్బు లావాదేవీలకు సంబంధించి   మధ్యవర్తుల సమక్షంలో రాజమండ్రిలో చర్చలు జరిగాయన్నారు. తన తండ్రి ప్రతిష్ఠను దెబ్బతీయడానికే మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని సూర్యకుమారి ఆరోపించారు.