ట్రెండ్ మార్చిన మావోలు.. బాణం బాంబులతో దాడులు..
Published on: Mon Mar 13, 2017 10:12AM

సాధారణంగా మావోయిస్టులు పోలీసులకు హతమార్చాలంటే బాంబులు పెట్టి హతమార్చేవారు. వారు ఏ దారిన వస్తారో తెలుసుకొని ల్యాండ్ మైన్లు పెట్టి పేల్చి చంపేవారు. అయితే ఇప్పుడు వారు కూడా ట్రెండ్ మార్చినట్టు కనిపిస్తోంది. తాజాగా ఛత్తీస్ గఢ్ లో పోలీసులు, మావోయిస్టుల మధ్య కాల్పులు చోటుచేసుకున్న సంగతి తెలసిందే. మావోలు సీఆర్పీఎఫ్ సిబ్బందిపై దాడులకు పాల్పడ్డారు. ఈ దాడుల్లో 12 మంది జవాన్లు సైతం మరణించిన సంగతి విదితమే. అయితే వారు ఈసారి బాణం బాంబులను వాడినట్టు తెలుస్తోంది. రాకెట్ లాంచర్ల తరహాలో బాణాలకు ప్రెషర్ బాంబులు అమర్చి దాడులు చేసిన వైనం వెలుగులోకి వచ్చింది. బాణాలకు బాంబులు అమర్చి పోలీసులపై దాడులకు దిగుతున్నట్టు సమాచారం. బాణం సరిగ్గా లక్ష్యాన్ని చేరుకున్నా.. చేరుకోపోయినా..కిందపడగానే బాంబు పేలి జవాన్లు మరణించే అవకాశం ఉంది. అందుకే మావోలు ఈ తరహా పద్దతిని ఉపయోగిస్తున్నట్టు తెలుస్తోంది.


