కాల్పుల కలకలం... 9 మంది జవాన్లు మృతి
Published on: Sat Mar 11, 2017 10:28AM

ఛత్తీస్ ఘడ్ లో మరోసారి కాల్పుల కలకలం రేగింది. ఛత్తీస్ ఘడ్ సుకుమా జిల్లా బెట్జి అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, జవాన్లు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 9 మంది జవాన్లు మృతి చెందగా.. ఇద్దరు మావోయిస్టులు కూడా మృతి చెందారు.


