TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వైద్యవిద్యలో మార్పులు?

Published on: Fri Apr 27, 2012 11:12AM

వైద్యవిద్యలో మార్పులు తీసుకురావడం కోసం కేంద్రప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రయత్నంలో భాగంగా మూడేళ్ళ మెడికల్ కోర్సును ప్రతిపాదిస్తున్నారు. ప్రస్తుతం ఎం.బి.బి.ఎస్. హౌస్ సర్జన్ తో సహా అయిదున్నర సంవత్సరాల కాలవ్యవధి పడుతుంది. అంతేకాకుండా కోర్సు రెండు విభాగాలుగా అంటే ఎం.బి.బి.ఎస్. అంటే బ్యాచిలర్ ఇన్ మెడిసిన్, బిఎస్ అంటే బ్యాచిలర్ ఇన్ సర్జన్ లుగా వుంది. కొత్తగా మూడేళ్ళ కోర్సు పెట్టే పక్షంలో బ్యాచిలర్ ఇన్ మెడిసిన్ అనే డిగ్రీ మాత్రమే ఇస్తారు.

 

 

ఈ కోర్సు ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు వైద్యసహాయం అందించడం కోసం నిర్దేశించింది. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో ఈ వైద్యులను నియమిస్తారు. ఇదే విధంగా ఎం.బి.బి.ఎస్.తో పాతు ఏదో ఒక విభాగంలో స్పెషలైజేషన్ వుండే విధంగా ఎం.బి.బి.ఎస్. కోర్సును మరో ఏడాది అంటే ఆరున్నర సంవత్సరాలకు చేసే ఎం.బి.బి.ఎస్. డిగ్రీకి బదులు ఎంఎస్ లేదా ఎండి ఇంటిగ్రేటెడ్ డిగ్రీ ప్రధానం చేసే విధంగా మార్పులు చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం నిపుణులతో చర్చలు జరుపుతోంది. మార్పులు చేర్పులు అమల్లోకి వచ్చే పక్షంలో వైద్యవిద్య అత్యధిక మందికి అందుబాటులోకి రావడమే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో వైద్యసేవల కొరత కూడా తీరుతుంది.