బాబు పర్యటనకు తెలంగాణవాదుల అడ్డంకులు
Published on: Fri Jan 6, 2012 8:48AM
వరం
గల్ : చంద్రబాబునాయుడు పర్యటనను అడ్డుకునేందుకు తెలంగాణవాదులు శతవిధాల యత్నిస్తున్నారు. బాబు పర్యటనకు నిరసనగా జనగాం-పెంబర్తి మార్గంలో రైల్వేట్రాక్పై క్లిప్పులను తెలంగాణవాదులు తొలగించారు. కాగా భువనగిరి సమీపంలోని రాయగిరి వద్ద చంద్రబాబు కాన్వాయ్పై తెలంగాణవాదులు రాళ్లు రువ్వారు.
కాగా, వరంగల్‌లో డిఎస్‌పి ఆఫీసుకు కూతవేటు దూరంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు హన్మకొండ డిపో ఆర్టీసీ అద్దె బస్సుకు నిప్పు పెట్టారు. సిబ్బంది సకాలంలో స్పందించి మంటలను ఆర్పడంతో సీట్లు మాత్రమే కాలిపోయాయి. టిడిపి అధినేత చంద్రబాబు రైతు పోరుబాట నేపథ్యంలో ఈ ఘటన ప్రాధాన్యత సంతరించుకుంది.


