TeluguOne Health

Download the TeluguOne App

Choose your platform to continue

నూతన సీఎం జగన్ కి లేఖ రాసిన మాజీ సీఎం బాబు

Published on: Thu May 30, 2019 12:35PM

 

ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న వైఎస్ జగన్‌ కి.. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు అభినందనలు తెలియజేస్తూ లేఖ రాశారు. ‘‘నూతన సీఎంగా  ప్రమాణం చేస్తున్న సందర్భంగా అభినందనలు. తెలుగుదేశం పార్టీ తరపున మీకు శుభాకాంక్షలు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, పేదల సంక్షేమమే లక్ష్యంగా కృషి చేయాలి. బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా నిర్మాణాత్మక సహకారం అందిస్తాం’’ అని లేఖలో చంద్రబాబు పేర్కొన్నారు.

కాగా కొద్దిసేపటి క్రితమే.. విజయవాడ ఇందిరా గాంధీ స్టేడియంలో వైఎస్ జగన్ చేత గవర్నర్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించారు.