పెట్టుబడుల ఆకర్షణే బాబు ఎజెండా

ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీకి చేరుకున్నారు. ఆర్థిక శిఖరాగ్ర సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. అలాగే సీఐఐ సభ్యులతో భేటీ కానున్నారు. అనంతరం ప్రధానమంత్రి సహా పలువురు కేంద్రమంత్రులను బాబు కలిసే అవకాశముంది. అయితే ఈ ఢిల్లీ టూర్ మెయిన్ ఎజెండా పెట్టుబడుల ఆకర్షణేనని ప్రచారం జరుగుతోంది. ఏపీకి మరిన్ని పెట్టుబడులను తీసుకొచ్చే దిశగా బాబు ఢిల్లీ టూర్ ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు.

 

ఏపీకి పెట్టుబడుల వెల్లువను తీసుకురావడానికి చంద్రబాబు ఎంతో శ్రమిస్తున్నారు.  ఎక్కడ ఏ చిన్న అవకాశాన్ని ఆయన జారవిడుచుకోవడానికి సిద్ధంగా లేరు. ప్రతిచోట నుంచి ఇన్వెస్టర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారాయన.  ఏపీని సాధ్యమైనంత త్వరగా డెవలప్ చేసి తన శక్తి సామర్థ్యాలను చాటిచెప్పడానికి అనుక్షణం తపిస్తున్నారు. ఇప్పటికే ఆ దిశగా ఆయన బాగా సఫలమయ్యారు కూడా. అయినా ఏ కోశాన ఆయన రిలాక్స్ మూడ్ లో కనిపించడం లేదు.

   

దేశం గర్వించేలా ఏపీని డెవలప్ చేయాలని కంకణం కట్టుకున్నారు.  బాబు కష్టపడుతున్న తీరుకు ప్రధాని మోడీ కూడా అబ్బురపడుతున్నారట. అందుకే బాబు ఏ సాయం కావాలని కోరినా... ఇవ్వడానికి ఓకే చెప్పేస్తున్నారు. అంతేకాదు ఇలాంటి సీఎం ఏపీకి ఉండడం నిజంగా ఎంతో అభినందనీయమని కేంద్రమంత్రులతో చెబుతున్నారట మోడీ.
 

Online Jyotish
Tone Academy
KidsOne Telugu