చిరంజీవిగా వర్ధిల్లండి.. మెగాస్టార్ కు బాబు బర్త్ డే విషెస్

 

 

ఆగస్టు 22 అంటే మెగా అభిమానులకు పండుగ రోజు. ఎలాంటి సీనీ నేపథ్యం లేకుండా కేవలం స్వయంకృషితో తెలుగు సినీ ప్రపంచంలో ఎదిగి మెగాస్టార్ అని ముద్దుగా పిలిపించుకుంటున్న చిరంజీవి పుట్టిన రోజు ఈరోజు. ఈ సందర్బంగా మెగాస్టార్ చిరంజీవికి టీడీపీ అధినేత చంద్రబాబు ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.  "స్వయంకృషితో అంచెలంచెలుగా ఎదిగి తెలుగు సినీపరిశ్రమలో తిరుగులేని స్థానంతో పాటు, అశేష ప్రేక్షకాభిమానాన్ని సంపాదించిన చిరంజీవిగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సంపూర్ణ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఆయన చిరంజీవిగా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను" అని అయన తన ట్విట్ లో పేర్కొన్నారు. ఇదే సందర్భంలో చిరంజీవితో కలిసి ఉన్న ఫోటోను కూడా చంద్రబాబు తన ట్వీట్‌లో పోస్ట్ చేశారు.