కేబినెట్ హోదా పదవి కోసం టీడీపీలో తీవ్ర పోటీ...చంద్రబాబు ఏమంటారో ?

 

అసెంబ్లీలో నియమించనున్న కమిటీలను ఈరోజు ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటించాల్సి ఉంది. పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీకి సభ్యులను జగన్ నియమించినా ఛైర్మన్‌ ను మాత్రం ప్రతిపక్షం నుండి నియమించాల్సి ఉంటుంది. ఈ నేపధ్యంలో  పీఏసీ (పబ్లిక్ అకౌంట్స్ కమిటీ) ఛైర్మన్ పదవిపై టీడీపీలో పోటీ మొదలయ్యింది. ఈ పదవి ఎవరికి కట్టబెట్టాలనే అంశంపై చంద్రబాబు కసరత్తు చేస్తున్నారని సమాచారం. 

ప్రతిపక్షానికి దక్కే వాటిలో ఇది కీలక పదవి కావడంతో టీడీపీ అధినేత అన్ని రకాలుగా ఆలోచించి ఒక నిర్ణయానికి రావాలని భావిస్తున్నారని అంటున్నారు. పీఏసీ ఛైర్మన్ అంటే మంత్రి పదవికి దాదాపు సమానం ఏపీలో ఎక్కడికి వెళ్లినా ప్రోటోకాల్ ఉంటుంది. ప్రాజెక్టుల్లో అవినీతి, భూకేటాయింపులు, ఉద్యోగ నియామకాలు ఇలా అన్ని అంశాల్లో ప్రశ్నించే హక్కు ఉంటుంది. అందుకే కేబినెట్ హోదా ఉండే ఈ పదవి కోసం టీడీపీలో పోటీ ఉందని అంటున్నారు. 

ఇంతటి కీలకమైన పదవి కావడంతో టీడీపీ సీనియర్ నేతలు సైతం ఈ పదవి కోసం పోటీపడుతున్నారు. పీఏసీ ఛైర్మన్ పదవి రేసులో నలుగురైదుగురు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయట. మాజీమంత్రి అచ్చెన్నాయుడు,  సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, సీనియర్ ఎమ్మెల్యే కరణం బలరామ్, సీనియర్ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పేర్లు బలంగా వినిపిస్తున్నాయి. 

అయితే అధినేత చంద్రబాబు ఎటువైపు మొగ్గు చూపుతారో అన్నది ఆసక్తిగా మారింది. తొలుత తెలుగుఎసం అధిఅకారంలోకి రాగానే వైసీపీ ప్రతిపక్షంలో ఉండి ఈ పదవిని, శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రరెడ్డికి ఇచ్చింది, ఆయన పార్టీ ఫిరాయించి తెలుగుదేశంలో చేరాక ప్రస్తుత ఆర్ధిక మంత్రి అప్పటి వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి పీఏసీ చైర్మన్‌గా ఉన్నారు. ఆయన ఈ పదవిని అడ్డం పెట్టుకుని టీడీపీ ప్రభుత్వాన్ని చాలా సార్లు కానర్ చేయడానికి చూసారు. అందుకే ఈసారి కూడా కాస్త పదునైన నేతకి అవకాశం ఇవ్వాలని చంద్రబాబు ఆలోచిస్తున్నట్టు చెబుతున్నారు,