TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చదలవాడకు టిడిపి తిరుపతి టికెట్

Published on: Mon Apr 9, 2012 1:09PM

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు సోమవారం తిరుమల శ్రీవారికి ప్రత్యేక పూజలు జరిపించారు. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడతు తిరుపతి నియోజకవర్గ అభ్యర్థిగా చదలవాడ కృష్ణ మూర్తిని పేరును ప్రకటించారు. శ్రీ వేంకటేశ్వరుని దర్శించుకొని ఉప ఎన్నికల ప్రచారం ప్రారంభించడానికి వచ్చినట్లు చెప్పారు. టిడిపి ఆనవాయితీలో భాగంగానే తిరుపతి నుండి ప్రచారం చేసేందుకు నిర్ణయించినట్లు చెప్పారు. అనంతరం ఆయన 2003లో అలిపిరిలో తనపై మావోయిస్టులు దాడి చేసిన ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆ స్వామి వారి దయ వల్లనే తాను బతికి బయట పడ్డానని, ఈసారి టిడిపి తిరిగి అధికారంలోకి వస్తుందని చెప్పారు.