TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

చంద్రబాబుకు కరోనా.. అందుకేనా? గెట్ వెల్ సూన్‌..

Published on: Tue Jan 18, 2022 8:25AM

టీడీపీ అధినేత చంద్రబాబుకు కరోనా పాజిటివ్ వ‌చ్చింది. స్వల్ప లక్షణాలు ఉన్నట్లు ఆయన వెల్లడించారు. కరోనా నిర్ధరణ కావడంతో హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు చంద్రబాబు ట్వీట్‌ చేశారు. 

అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఉండవల్లిలోని నివాసంలో చంద్రబాబు హోంఐసోలేషన్‌లో ఉన్నారు. ఇటీవల కాలంలో తనకు సన్నిహితంగా ఉన్నవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు.  

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌కు సోమ‌వారం కొవిడ్‌ నిర్ధరణ కాగా.. మంగ‌ళ‌వారం చంద్ర‌బాబుకు క‌రోనా పాజిటివ్ వ‌చ్చింది. ఇటీవ‌ల టీడీపీ అధినేత.. ప‌ల్నాడులో వైసీపీ నేత‌ల చేత‌లో హ‌త్య‌కు గురైన చంద్ర‌య్య కుటుంబాన్ని ప‌రామ‌ర్శించి.. టీడీపీ కార్య‌క‌ర్త పాడె మోసారు. ఆ సమ‌యంలో జ‌న‌స‌మూహం అధికంగా త‌ర‌లివ‌చ్చింది. ఆ సంద‌ర్భంలో ఏమైనా వైర‌స్ సోకిందేమోన‌ని అనుమానిస్తున్నారు. అందుకే, గ‌త వారం రోజులుగా చంద్ర‌బాబును క‌లిసిన వారంతా జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని సూచిస్తున్నారు.