TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బాబును బాధ పెట్టిన కోడిగుడ్లు

Published on: Sun Jun 10, 2012 10:37AM

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు బాధగా ఉన్నారు. ఆయన సుదీర్ఘరాజకియజీవితంలో ఉహించని సంఘటన ఎదురైందట. ఆ సంఘటన గురించి చెప్పడానికి కుడా మనసు ఒప్పుకోవడం లేదట. అయినా పాపం మీడియా చూసేటప్పటికి మనస్సు దానంతటదే బయటపడుతుందనుకోండి. ఆయన కుడా నోరు జారారు. తన ముప్పైయేళ్ళ రాజకీయ జీవితంలో ఎప్పుడు ప్రసంగించినా శేహబాష్ అనిపించుకున్నవని గుర్తు చేసుకున్నారు. ఈ మాట తరువాత బాబు తను గుంటూరు జిల్లా పత్తిపాడులో ఎన్నికల ప్రచార సభకు అంటూ చుట్టుచుశారు. మీడియా గమనిస్తోందని నిర్ధారించుకున్న తరువాత బాబు తన మాటను కొనసాగిస్తు సభలో ఎవరో కానీ నాపై కోడిగుడ్లు, రాళ్ళు విసిరారు అన్నారు. ఇది మరిచిపోదమనుకున్నా, మరచిపోలేకపోతున్నాను అన్నారు. ఇది మీడియా ముందు కక్కేశారు కాబట్టి ఇక ప్రశాంతమె అని ఒక విలేకరి చమత్కరించగానే మొహం మరోవైపుకు తిప్పుకున్నారు.