ఇదిగో ప్రూఫ్... జగన్ రాజీనామా చేస్తావా: బాబు ప్రతి సవాల్

 

 

ఈరోజు ప్రారంభమైన అప్ శాసన సభ సమావేశాలు సవాళ్లు ప్రతి సవాళ్లతో వేడి వేడిగా మొదలయ్యాయి. ఈరోజు రైతులకు విత్తనాల పంపిణి పై జరిగిన చర్చలో పాల్గొన్న సీఎం జగన్ చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు సున్నా వడ్డీకే రైతులకు రుణాలిస్తామని ప్రకటించి ఒక్కరికి కూడా ఇవ్వలేదని విమర్శించారు. దానికి సంబంధించిన రికార్డులు బయటపెడితే చంద్రబాబు రాజీనామా చేస్తారా అంటూ జగన్ మోహన్ రెడ్డి ప్రశ్నించారు. తాజాగా జగన్ వ్యాఖ్యల పై ప్రతిపక్ష నేత  చంద్రబాబు ప్రతి సవాల్ విసిరారు. టీడీపీ హయాంలో కూడా సున్నా వడ్డీకే రైతులకు రుణాలు ఇచ్చినట్టు తమ వద్ద మూడు ఆధారాలు ఉన్నాయన్నారు. మా పార్టీ నేత రామానాయుడు కూడా ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పారు" అంటూ తమపై వచ్చిన విమర్శలకు చంద్రబాబు దీటుగా బదులిచ్చారు. ఈ సందర్భంగా కొన్ని కీలకమైన పత్రాలను కూడా ఆయన మీడియా ప్రతినిధులకు అందజేశారు. సున్నా వడ్డీ రుణాలకు సంబంధించిన పేపర్లు తీసుకుని వచ్చేలోపు ప్రభుత్వ నేతలు అసెంబ్లీని వాయిదా వేసుకుని వెళ్లిపోయారని చంద్రబాబు ఆరోపించారు. దీనిపై  జగన్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి లేదా రాజీనామా చేయాలని విపక్ష నేత చంద్రబాబు డిమాండ్ చేశారు. దీనిపై రేపు సభాహక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామని చంద్రబాబు ప్రకటించారు. సీఎం జగన్ అసత్యాలతో తనకు సవాల్ విసిరారన్నారు. టీడీపీ నేతలపై దాడులతో జగన్పొ లిటికల్ టెర్రరిజం క్రియేట్ చేస్తున్నారని ఆరోపించారు.