బీజేపీకి షాక్ ఇచ్చే దిశగా బాబు

 

ఏపీకి కేంద్రం అన్యాయం చేస్తుందంటూ బాబు ఎన్డీయే నుండి బయటికొచ్చి రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్న సంగతి తెలిసిందే.. అలానే టీడీపీ,బీజేపీల మధ్య మాటల యుద్ధం జరుగుతున్న సంగతి కూడా తెల్సిందే.. అయితే బాబు 2019 లో బీజేపీయేతర ప్రభుత్వ ఏర్పాటుకు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తుంది.. దానిలో భాగంగానే శాంపిల్ గా బీజేపీకి ఒక షాక్ ఇవ్వడానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది.. అదేంటంటే..

రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక త్వరలో జరగనుంది.. ఆ ఎన్నిక సాక్షిగా బాబు తన సత్తా చూపబోతున్నట్టు తెలుస్తుంది.. రాజ్యసభ మొత్తం సభ్యుల సంఖ్య 245 కాగా.. 4 ఖాళీ ఉండటంతో ప్రస్తుతం ఆ సంఖ్య 241 .. అంటే డిప్యూటీ చైర్మన్ కావాలంటే కనీసం 121 ఓట్లు కావాలి.. బీజేపీకి సొంత బలం 80 .. మిత్రపక్షాలు, మరికొన్ని పార్టీల మద్దతు ఉంటే తప్ప బీజేపీ రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికలో విజయం సాధించలేదు..

అందుకే బాబు బీజేపీకి ఇప్పుడొక షాక్ ఇవ్వాలనుకుంటున్నారట.. బీజేపీ వ్యతిరేక శక్తులన్నిటినీ ఒక త్రాటి మీదకు తీస్కొచ్చి.. బీజేపీని ఓడించాలి అనుకుంటున్నారట.. బాబుకి జాతీయ స్థాయిలో మంచి పేరుంది.. జాతీయ నేతలు, వివిధ పార్టీ నాయకులతో సత్సంబంధాలు ఉన్నాయి..

బాబు తలుచుకుంటే బీజేపీయేతర పార్టీలను ఏకం చేయడం పెద్ద కష్టం కాదు.. ఇక బీజేపీని గద్దె దించటమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్, బీజేపీకి వ్యతిరేకంగా అంటే సహజంగానే ముందడుగు వేస్తుంది..దీన్నిబట్టి చూస్తే రాజ్యసభ సాక్షిగా బాబు, బీజేపీకి షాక్ ఇచ్చే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు.