మోదీ భార్య పేరుతో చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

 

ముల్లుని ముల్లుతోనే తీయాలి అన్నట్లుగా.. నిన్న గుంటూరు సభలో ప్రధాని మోదీ తనపై చేసిన వ్యాఖ్యలను ఏపీ సీఎం చంద్రబాబు అదే స్టైల్ లో తిప్పికొట్టారు. లోకేష్ తండ్రి, ఏపీ సీఎం అంటూ చంద్రబాబుపై మోదీ వ్యాఖ్యలు చేశారు. దాన్ని తిప్పికొట్టడానికి చంద్రబాబు కూడా మోదీ కుటుంబాన్ని టార్గెట్ చేసారు. నేను లోకేష్ తండ్రినే.. తాను లోకేష్ తండ్రిని అయినందుకు గర్విస్తున్నానని అన్నారు. మీకు కుటుంబం లేదు, బంధాలు లేవు, కుటుంబ వ్యవస్థ మీద గౌరవం లేదు, మీ భార్య జశోదా బెన్ గురించి మాట్లాడితే మీరు తల ఎక్కడ పెట్టుకుంటారు అని విరుచుకుపడ్డారు. మోదీకి మానవత్వం, కుటుంబ సంబంధాల గురించి తెలియదని, మోదీకి కుమారుడు లేడని, భార్యకూ కుటుంబానికీ మోదీ దూరమయ్యారని అన్నారు. తాను వ్యక్తిగత విమర్శలకు వ్యతిరేకమని.. కానీ, మోదీ తన కుటుంబాన్ని ప్రస్తావించారు కాబట్టి అదే తరహాలో తాను తిప్పికొట్టక తప్పదని చంద్రబాబు అన్నారు.