ఎన్నికలు వస్తే టీడీపీ క్లీన్ స్వీప్ చేస్తుంది

 

ఏపీ రాజకీయాలు రోజు రోజుకి వేడెక్కుతున్నాయి.. వైసీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బీజేపీ నేతలతో భేటీ అయ్యారని వార్తలు రావడంతో.. టీడీపీ నేతలు 'బీజేపీ వైసీపీ లు కలిసి కుట్ర రాజకీయాలు చేస్తున్నాయి' అంటూ మండిపడుతున్నారు.. ఇదే విషయం మీద సీఎం చంద్రబాబు కూడా స్పందించారు.. కడప స్టీల్ ప్లాంట్ అసాధ్యమని ఓ వైపు కేంద్రం అఫిడవిట్ దాఖలు చేస్తే, మరోవైపు వైసీపీ నేతలు ఢిల్లీ వెళ్లి బీజేపీ పెద్దలతో లాలూచీ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.. రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అడగక ముందే వైసీపీ మద్దతు తెలిపిందని గుర్తుచేశారు.. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న బీజేపీని జగన్ ఎందుకు నిలదీయట్లేదు అంటూ ప్రశ్నించారు.. ఇవన్నీ బీజేపీ,వైసీపీల కుట్ర రాజకీయాలకి నిదర్శనం అన్నారు.. అలానే కర్ణాటకలో గాలి జనార్దన్ రెడ్డితో, ఇక్కడ జగన్ తో కలిసి నడిచే బీజేపీ, అవినీతిపై పోరాడుతుందని చెప్తే ఎవరైనా నమ్ముతారా అంటూ విమర్శించారు.. బుగ్గన, బీజేపీ నేతలతో భేటీ అవ్వడం ఆ రెండు పార్టీల మైత్రికి నిదర్శనం అన్న బాబు, 5 ఎంపీ స్థానాలకు ఉపఎన్నికలు జరిగితే బాగుండేది.. నంద్యాల, కాకినాడ తరహాలో స్వీప్ చేసేవాళ్ళం అన్నారు.. ఈ ఫలితాలు ఊహించే ఉపఎన్నికలు రాకుండా ఆ పార్టీలు జాగ్రత్త పడ్డాయి అన్నారు.