TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

విశాఖలో చంద్రబాబు సైకిల్ సవారీ.. పర్యావరణ పరిరక్షణపై సందేశం

Published on: Fri Jun 5, 2026 12:08PM

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు విశాఖపట్నంలో సైకిల్ సవారీ చేసి పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించారు. పచ్చదనం పెంపు, కాలుష్య నియంత్రణ, కార్బన్ ఉద్గారాల తగ్గింపు లక్ష్యంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీఎం సైకిల్ సవారీ కార్యక్రమం ప్రజల్లో పర్యావరణ చైతన్యాన్ని పెంపొందించడంతో పాటు ఆరోగ్యకర జీవనశైలిపై కూడా అవగాహన కల్పించేలా నిలిచింది.

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్బంగా విశాఖ నుంచి ఇచ్చిన ఈ సందేశం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు స్ఫూర్తినిచ్చేలా ఉంది.  వాహనాల వినియోగాన్ని తగ్గించి సాధ్యమైనంత వరకు సైకిళ్లను ఉపయోగించడం ద్వారా ఇంధన వినియోగం తగ్గడంతో పాటు గాలి కాలుష్యాన్ని కూడా నియంత్రించవచ్చని చంద్రబాబు పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు.