TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కన్నాపై చెప్పు దాడి.. చంద్రబాబు స్పందన

Published on: Thu Jul 5, 2018 5:32PM

 

నెల్లూరు జిల్లా పర్యటనలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కన్నా లక్ష్మీనారాయణకు చేదు అనుభవం ఎదురైంది..కన్నా, బీజేపీ కార్యకర్తలతో కలిసి నెల్లూరు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు.. ఈ సమయంలో ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన గొర్రెపాటి ఉమామహేశ్వర రావు అనే లారీ డ్రైవర్, కన్నా మీదకి చెప్పు విసిరాడు.. దీంతో ఆగ్రహించిన బీజేపీ కార్యకర్తలు ఆ వ్యక్తిని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.. ఈ దాడి వెనక టీడీపీ ఉందంటూ కొందరు బీజేపీ నేతలు ఆరోపించారు..

అయితే దాడి చేసిన వ్యక్తి మాత్రం 'తనకు నరేంద్ర మోడీ అంటే ఉన్న కోపంతోనే కన్నా లక్ష్మీనారాయణపై దాడి చేశానని.. తన వెనుక ఎవరూ లేరని.. ఎవరి ప్రోద్భలంతో దాడి చేయలేదని' చెప్పినట్టు తెలుస్తుంది.. అయితే ఈ ఘటనపై తాజాగా సీఎం చంద్రబాబు స్పందించారు.. కేంద్రం చేసిన నమ్మకద్రోహంపై తాము ధర్మపోరాటం చేస్తున్నామని.. చేతనైతే రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో పోరాడాలని.. అలా పోరాడటం చేతగాకుంటే తమ వెంట నడవాలని.. అంతేకాని ఇలాంటి పనులు చేయొద్దు అంటూ చంద్రబాబు హెచ్చరించారు.