TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పకడ్బందీగా సీఆర్‌డీఏ చట్టం.. హైకోర్టు తీర్పుతో 5 కోట్ల ఆంధ్రుల విజయం..

Published on: Thu Mar 3, 2022 5:12PM

ఎంతో పకడ్బందీగా, ముందు చూపుతో సీఆర్‌డీఏ చట్టాన్ని తీసుకొచ్చాం.. అందుకే, హైకోర్టులో ఆ చ‌ట్టం నిల‌బ‌డింది.. ప్రజా రాజధానిని కాపాడుకున్నది అమరావతి రైతులు, రాష్ట్ర ప్రజలే. ఈ విజయం 5 కోట్ల ఆంధ్రుల‌ విజయం.. అని అన్నారు టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు. రాజధాని కోసం అలుపెరగని పోరాటం చేసిన రైతులు, మహిళలను అభినందించారు. 

"ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా.. 99 శాతం ఏకగ్రీవంగా.. ల్యాండ్‌ పూలింగ్‌ కింద భూమిని ఇచ్చిన ప్రాంతం అమరావతి. ఎలాంటి కోర్టు కేసులు, వివాదాలు లేకుండా రైతులు 33వేల ఎకరాలు ఇచ్చారు. ప్రధాని మోదీ, సింగపూర్‌ నుంచి మంత్రులు భూమి పూజకు విచ్చేశారు. అమరావతి చుట్టూ 187 కి.మీ. రింగ్‌రోడ్డుకు రూపకల్పన చేశా. రింగ్‌రోడ్డు లోపల ప్రపంచస్థాయిలో 9 నగరాలు నిర్మించాలని భావించా." అని చంద్ర‌బాబు చెప్పారు.

అయితే, అమరావతి ప్రాంతం ముంపునకు గురవుతుందని దుష్ప్రచారం చేశారు. భారీ వరదల్లోనూ ఒక్క ప్రాంతం కూడా ముంపునకు గురి కాలేదు. పట్టిసీమ ప్రాంతాన్ని శ్మశానం అని తక్కువ చేశారు. రాజధాని ప్రాంతాన్ని ఎడారిగా చిత్రీకరించారంటే వైసీపీ నేతలు ఎంత దుర్మార్గులో అర్థం చేసుకోవాలి. అమరావతిని అడ్డుకున్న వైసీపీ నేతలు చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసే అధికారం ఎవరిచ్చారు? ప్రజలు తిరగబడితే పోలీసులు ఏం చేయగలుగుతారు? మీ రాజధాని ఏదని అడిగితే మన పిల్లలు చెప్పుకునే పరిస్థితి లేకుండా చేశారు. అమరావతిలో అతి పెద్ద వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించాలని ప్రారంభిస్తే.. వైసీపీ ప్రభుత్వం దాన్ని కూడా నిలిపివేసింది. కొవిడ్‌ సమయంలో ఏపీ ప్రజలు ఆసుపత్రుల కోసం హైదరాబాద్‌కు వెళ్తే అడ్డుకున్నారు. అమరావతిని అభివృద్ధి చేసి ఉంటే ఆ పరిస్థితి వచ్చేది కాదు. రాజధాని భూములు కుదువపెట్టి రుణాలు తెచ్చుకునేందుకు జగన్‌ ప్రయత్నిస్తున్నారు" అని చంద్రబాబు మండిప‌డ్డారు.