ఒకేసారి ఇద్దరికి కౌంటర్..!!
Published on: Sat Aug 4, 2018 12:09PM

ఏపీ సీఎం చంద్రబాబు మీద వైఎస్ జగన్, పవన్ కళ్యాణ్ తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే.. కృష్ణా జిల్లా పర్యటనలలో ఉన్న చంద్రబాబు.. జగన్, పవన్ లకు గట్టి కౌంటర్ ఇచ్చారు.. 'చంద్రబాబు ఏమైనా అంటే సింగపూర్ వంటి రాజధాని అంటారు కానీ సింగపూర్ వంటి పాలన మాత్రం అనరని' పవన్ చంద్రబాబు మీద విమర్శలు చేసిన సంగతి తెలిసిందే.. దీనిపై స్పందించిన బాబు, సింగపూర్ వంటి పాలన కావాలని పవన్ చెబుతున్నారని.. కానీ అదే సింగపూర్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని విశ్వసించిందని గుర్తించాలని అన్నారు.. అలానే జగన్ మీద, వైసీపీ మీద విమర్శలు గుప్పించారు.. టీడీపీ ఎంపీలు పార్లమెంటులో పోరాడితే, వైసీపీ ఎంపీలు మాత్రం రాజీనామా చేసి పారిపోయారని అన్నారు.. జగన్ పసలేని, పద్ధతి లేని విమర్శలు చేస్తున్నారని, ఆయన వ్యాఖ్యలకు ఒక్కోసారి బాధ వేస్తున్నా ప్రజల కోసం భరిస్తున్నానని చెప్పారు.. వైసీపీ సభ్యత లేని పార్టీ.. డబ్బు సంపాదన, కేసుల మాఫీ కోసం వచ్చిన పార్టీ అని విమర్శించారు.. ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టుగా.. చంద్రబాబు ఒకేసారి పవన్, జగన్ లకు కౌంటర్ ఇచ్చారుగా.


