పవన్ కళ్యాణ్‌ది గొప్ప మనసు.. చంద్రబాబు
Published on: Thu Oct 16, 2014 11:06AM
.jpg)
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్‌ని ప్రశంసించారు. హుదుద్ తుఫాను బాధితులను పరామర్శించడానికి పవన్ కళ్యాణ్ విశాఖపట్టణం వెళ్ళిన విషయం తెలిసిందే. అక్కడ గురువారం నాడు చంద్రబాబు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్‌ని ప్రశంసించారు. బాధితులను ఆదుకోవడంలోను, సేవా కార్యక్రమాల్లోనూ ఎప్పుడూ ముందుండే పవన్ కళ్యాణ్ అభినందనీయుడని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు.


