బీజేపీ, టీడీపీ మధ్య దూరం.. అదేనా కారణం.!!

 

దోస్త్ మేరా దోస్త్ అంటూ 2014 ఎన్నికల్లో బీజేపీ,టీడీపీ కలిసి పోటీ చేసాయి.. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చాయి.. రెండు పార్టీలు కలిసి ప్రయాణం చేసాయి.. కానీ నాలుగేళ్ళ తరువాత సీన్ రివర్స్ అయింది.. రెండు పార్టీలు దూరమయ్యాయి.. ఏపీకి అన్యాయం చేసారని టీడీపీ, బీజేపీని అంటుంటే.. ఏపీలో అవినీతి పెరిగిపోయిందని బీజేపీ, టీడీపీని అంటుంది.. ఇలా రెండు పార్టీల మధ్య మాటల యుద్ధం జరుగుతుంది.. ఇలాంటి సమయంలో నితిన్ గడ్కరీ ఏపీ పర్యటనకు వచ్చారు.

 

 

విశాఖపట్టణం బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ హాలులో జాతీయ రహదారుల అభివృద్ధి పనులకు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో కలిసి చంద్రబాబు శంకుస్థాపన చేశారు.. ఈ సందర్బంగా చంద్రబాబు బీజేపీ,టీడీపీ పార్టీల మధ్య దూరం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసారు.. విభజన హామీలు అమలుచేయకపోవడమే ఇరుపార్టీల మధ్య దూరానికి కారణమని చెప్పారు.. విభజన హామీలు నెరవేరిస్తే ఇబ్బందులు ఏముంటాయని అన్నారు.. అన్నీ చేస్తామని కేంద్రం చెబుతోంది.. కానీ, ఎంత సమయంలో చేస్తారనేదే ముఖ్యమన్నారు.. ఐదేళ్లలో కాకుండా పదేళ్లకు చేస్తే ఎలా? అని చంద్రబాబు ప్రశ్నించారు.