సీఎం చంద్రబాబు కార్యాలయం రెడీ!
Published on: Thu Jun 13, 2024 2:58PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కార్యాలయం ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో సిద్ధమైంది. ముఖ్యమంత్రి కార్యాలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. ముఖ్యమంత్రి నేమ్ ప్లేట్ పెట్టారు. ద్వారాల దగ్గర పూలతో అలంకారం చేశారు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు తన కార్యాలయానికి వచ్చి, ముఖ్యమైన ఐదు ఫైళ్ళ మీద సంతకాలు చేయనున్నారు.


