TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వన్ డే సీఎం కాబోతున్న చంద్రబాబు

Published on: Wed Apr 12, 2017 2:31PM

ఇండియన్ స్పీల్ బర్గ్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఒకేఒక్కడు సినిమాని భారతీయులు మరచిపోలేరు. ఆ మూవీలో వన్ డే సీఎం కాన్సెప్ట్ జనానికి పిచ్చ పిచ్చగా నచ్చేసింది. హీరో అర్జున్ ఒక రోజు ముఖ్యమంత్రిగా చేసిన పనులు అప్పట్లో రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా నిలిచాయి. ముఖ్యంగా హీరో ప్రభుత్వాధికారుల అవినీతిని, నిర్లక్ష్యాన్ని దుమ్ము దులిపి ప్రజల సమస్యలు పరిష్కారిస్తాడు. ఇప్పుడు అచ్చం అలాంటి ఫార్ములానే అనుసరించబోతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాల్లో ఏ పని జరగాలన్నా చేయి తడపాల్సిందేనని ఆరోపణలు వస్తున్నాయి..దీంతో ప్రభుత్వంపై విమర్శలకు తోడు చెడ్డ పేరు వస్తుంది.

 

ఈ విషయం సీఎం దాకా వెళ్లడంతో ఆయన గుర్రుగా ఉన్నారు. అవినీతి అంతానికి నడుం బిగించిన చంద్రబాబు తనకు బాగా నమ్మిన నెస్తం టెక్నాలజీనే ఇందుకు సరైన ఆయుధం అని భావించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఐటీ నిపుణులు ఒక యాప్ రూపొందించారు. ఆ యాప్ ద్వారా ఒక్క సందేశం పంపితే చాలు..ఎలాంటి సమస్యకైనా కేవలం అరగంటలోనే పరిష్కారం లభిస్తుంది. ప్రభుత్వ కార్యాలయాల్లో లంచం అడిగినా..పనులు నత్తనడకన సాగినా..అధికారులు వేధిస్తున్నా..ఈ యాప్ ద్వారా ప్రజలు ఫిర్యాదు చేయవచ్చు. ఈ నెల 14న సీఎం దీనిని ప్రారంభించనున్నారు. ఈ యాప్ కనుక సమర్థవంతంగా పనిచేయడం మొదలు పెడితే అవినీతి అధికారుల కథ కంచికే. అలా జరగాలని..అవినీతి రహిత సమాజాన్ని చూడాలనుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కల సాకారం కావాలని కోరుకుందాం.