అడగాల్సింది మోడీని కానీ.. నన్ను కాదు

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా.. విభజన హామీలపై అమలు తదితర అంశాల గురించి కేంద్రప్రభుత్వాన్ని నిలదీయకుండా.. కొందరు తనను తిడుతున్నారన్నారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. అనంతపురం జిల్లా పెనుకొండలో జరిగిన ఓ బహిరంగ సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి.. కొన్ని పార్టీల నేతలు పొద్దున లేచిన దగ్గరి నుంచి తనను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. ఒక న్యూస్ పేపర్ ఉందనీ.. ఆ పేరు నేను చెప్పలేను.. కానీ మీకు తెలుసు.. అసత్యాలు రాసీరాసీ అలసిపోతున్నారు. ఆ పేపర్‌ని ఎవరైనా నమ్ముతారా..? అని ప్రశ్నించారు. కేంద్రప్రభుత్వం, రాష్ట్రానికి అందించాల్సిన సాయం అందించట్లేదని చెప్పారు. అరకొర నిధులిచ్చి చేయి దులుపుకుంటున్నారని కేంద్రాన్ని ఆయన నిందించారు. తాను 29 సార్లు ఢిల్లీకి వెళ్లానని తెలిపారు. ఆనాడు హేతుబద్ధత లేకుండా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించిందని.. ఏపీకి కేంద్రప్రభుత్వం న్యాయం చేయాల్సి ఉందని చెప్పారు.